తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్..? త్వరపడండి మరి..!
ఈ ప్లాంట్లలో మొత్తం ఖాళీలు: 277 పోస్టులు ఉన్నాయి. అవి. టెక్నికల్ ఆఫీసర్, సై పెండరీ ట్రెయినీ, నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అప్పర్ డివిజన్ క్లర్క్, తదితరాల రకాలు. ఈ పోస్టులకు పోస్టుని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా
(ఇంజినీరింగ్), బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత అర్హతలుగా ఉన్నాయి. కంప్యూటర్, టైపింగ్ స్కిల్స్, అనుభవం కూడా ఉద్యోగాన్ని బట్టి అవసరం ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ: జనవరి 31, 2020. మరిన్ని వివరాల కోసం https://www.hwb.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.