సైనిక్ స్కూళ్లంటే క్రమ శిక్షణకు మారు పేరు.. అలాంటి సైనిక్ స్కూళ్లో సాధారణ డిగ్రీ, బీఈడీతో ఉద్యోగం సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది. మిజోరంలోని సైనిక్ స్కూల్ చింగ్‌చిప్ స్కూల్ ఈ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది.
ఇవన్నీ టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు. మొత్తం ఖాళీలు: 15. పోస్టులు ఉన్నాయి. అవేంటంటే.. టీజీటీ (ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్), లైబ్రేరియన్, ఆఫీస్ సూపరింటెండెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ), లోవర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ) తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
ఇక అర్హతల విషయానికి వస్తే.. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో టెన్త్, మెట్రిక్యులేషన్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత, అనుభవం ఉంటుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.500. చివరితేది: 29.02.2020. పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ చింగ్‌చిప్, చింగ్‌చిప్ విలేజ్, సెర్చిప్ జిల్లా , మిజోరం. పిన్‌కోడ్ - 796161 మరిన్ని వివరాల కోసం https://sschhingchhip.mizoram.gov.in/ వెబ్సైట్ చూడండి.
మరింత సమాచారం తెలుసుకోండి: