గుడ్ న్యూస్.. డీఆర్డీఓలో ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు..!!
ఉద్యోగాలు లేక సతమతవుతున్న యువత ఎందరో ఉన్నారు. అలాంటి వారిందరికీ ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్డీఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 116 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 23 చివరి తేదీ.
దీంతో మార్చి 30 వరకు గడువు పొడిగించింది డీఆర్డీఓ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండటంతో మరోసారి గడువు పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2020 ఏప్రిల్ 17 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేయకూడదు.
పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 116 పోస్టులు ఉండగా అందులో కార్పెంటర్- 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 23, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 5, ఎలక్ట్రీషియన్- 20, ఎలక్ట్రానిక్స్- 2, ఫిట్టర్- 33, మెషినిస్ట్- 11, మెకానిక్ (మోటార్ వెహికిల్)- 5, పెయింటర్- 2, ప్లంబర్- 2, టర్నర్- 5, వెల్డర్- 6 పోస్టులున్నాయి. ఇక దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు.