బీటెక్ పాస్ అయ్యారా.. అయితే మీకోసమే ఈ 259 ఉద్యోగాలు.. డోంట్ మిస్..!!
బీటెక్ పాస్ అయ్యారా..? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. మీ కోసం 259 ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్-NLCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు శుభవార్త అందించింది. మొత్తం 259 ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే చాలు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.nlcindia.com/ వెబ్సైట్లో ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ పోస్టులకు మార్చి 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 17 చివరి తేదీ. కాబట్టి ఆసక్తికర అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండ.
ఇక మొత్తం 259 ఖాళీలు ఉన్నాయి. అందులో మెకానికల్- 125, ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65, ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10, సివిల్- 5, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్- 15, కంప్యూటర్- 5, మైనింగ్- 5, జియాలజీ- 5, ఫైనాన్స్- 14, హ్యూమన్ రీసోర్స్- 10 పోస్టులున్నాయి. . జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ పాస్ కావాలి.