ఏపీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షలకు కరోనా దెబ్బ!

Durga Writes

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అగ్ర రాజ్యాలను సైతం కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. అలాంటి ఈ కరోనా వైరస్ నియంత్రణకై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా ఈ నేపథ్యంలోనే విద్యాసంస్దలు అన్ని కూడా బంద్ అయ్యాయి. 

 

ఇంకా ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా మే 14 , 2020 వరకు జరగాల్సిన అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ నెల ఏప్రిల్ 20, 2020 నుండి జరగాల్సిన ఏపీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ అన్ని పరీక్షలను వాయిదా పడ్డాయి. ఇకపోతే ఈ ప్రవేశ పరీక్షలకు అభ్యర్దులు లెట్ ఫి తో మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మర్చి 29, 2020 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 17, 2020 వరకు పొడిగిస్తూ ఏపీ స్టేట్ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: