ఏపీలో నిరుద్యోగులకి గుడ్ న్యూస్...వైజాగ్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు..!!!
కరోనా సమయంలో ఏపీలో నిరుద్యోగులకి వైజాగ్ షిప్ యార్డ్ గుడ్ న్యూస్ తెలిపింది. వైజాగ్ లోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఏప్రియల్ 7 తోనే ముగియనుండగా కరోనా నేపధ్యంలో నోటిఫికేషన్ గడుపు పొడిగించింది. డిజైనర్, జూనియర్ సూపర్ వైజర్ వంటి పలు పోస్తులని భర్తీ చేయనుంది..ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..
మొత్తం పోస్టుల సంఖ్య : 51
పోస్టుల వివరాలు :
డిజైనర్ మెకానికల్ : 10
డిజైనర్ ఎలక్ట్రికల్ : 03
జూనియర్ సూపర్వైజర్ మెకానికల్ : 07
జూనియర్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ : 09
జూనియర్ సూపర్వైజర్ సివిల్ : 07
ఆఫీస్ అసిస్టెంట్ : 09
జూనియర్ ఫైర్ ఇన్స్పెక్టర్ : 02
అర్హత : సంభంతిత విభాగాలలో డిప్లమో, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు :రూ. 200 ఎస్సీ ఎస్టీ వికలాంగులకి ఫేజు లేదు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ :
General Manager (HR) A.C.,
Hindustan Shipyard Ltd.,
Gandhigram (PO)
Vishakapatnam
మరిన్ని వివరాలకోసం :
https://www.hslvizag.in