అలుగులతోనే మనుషులకు కరోనా.. అయినా వాటికేం కావడం లేదు..ఎందుకంటే..?
కరోనా వైరస్ నివారణకు, నియంత్రణకు విస్తృత పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తికి కారకమైన జంతువులను, జీవరాశులను గుర్తిచడంతో పాటు అవి ఎలా తట్టుకుని మనగలిగాయి అనే దానిపై శోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పరిశోధకులు ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందంట. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి ఉద్బవించిందని తెలుస్తుండగా..కరోనా వైరస్‌ను సక్రమింపజేసింది మాత్రం అలుగులని తెలుస్తోంది. గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా వైరస్ సోకడంలో అలుగులు వాహకాలుగా పనిచేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటికే ఈ విషయంలో గణనీయమైన శోధన ఫలితాలను రాబట్టారు. అయితే మనుషులపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్‌లు అలుగుల్లో ప్రభావం చూపడంలేదు. ఇందుకు వాటిలోని జన్యు వైవిధ్యమే కారణమని శాస్త్రవేత్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా వైరస్‌తో అలుగులకు ప్రాణహాని లేకపోవడానికి గల కారణాలేంటన్నది ఇంకా అంతుబట్టడం లేదు. అయితే అలుగుల్లోని ఆ వ్యవస్థను గుర్తించగలిగితే.. కొవిడ్-19 నివారణ, నియంత్రణలో గణనీయమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వ్యాధికి చికిత్సను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఆస్త్రియా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అంశంపై శోధన చేస్తున్నారు. వారు గుర్తించిన అంశాలను ఈ విధంగా వెల్లడించారు. మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తికి భిన్నంగా.. అలుగుల్లో కరోనా వైరస్‌ని సహించే గుణం ఉంది. దీంతో అలుగుల్లోని జన్యువులు వాటితో కలిసి జీవించగలుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే కొన్ని జన్యువులు వాటిని పసిగట్టి రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడం జరుగుతుంది. కానీ అలుగుల్లో వైరస్‌లను గుర్తించే రెండు జన్యువుల్లేకపోవడం గమనార్హం. తద్వారా ఈ వైరస్‌లపై పోరులో వాటి రోగనిరోధక శక్తి తీవ్రత తగ్గడం లేదంటే స్పందన సమయంలో మార్పులు చోటు చేసుకుంటుండం మేం గుర్తించినట్లుత తెలిపారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple