నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లోని జాతీయ సంస్థలో ఉద్యోగాలు, వివరాలు..!!
ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. చైనాలోని వూహాన్లో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతకర కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రభుత్వాలకు మరింత పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే కరోనాని కట్టడి చేసేందుకు పలు దేశాలు దేశాలు లాక్డౌన్ చేశారు. ఈ లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR ఉద్యోగాలు భర్తీ చేస్తోంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవలే విడుదల చేసింది కూడా. ఈ నోటిఫికేషన్లో మొత్తం 32 పోస్టులన్నాయి. కంటెంట్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ 2020 మే 23. అంటే మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ పోస్టులు హైదరాబాద్‌లో, మరికొన్ని న్యూ ఢిల్లీలో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాల కోసం https://nirdpr.org.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ నోటిఫికేషన్లో మొత్తం 32 ఖాళీలు ఉండగా.. అందులో అసిస్టెంట్ డైరెక్టర్, పెడగాగి / T&D - 1, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అనలిస్ట్ (స్కిల్స్ అండ్ లైవ్లీహుడ్స్) / ఇన్నొవేషన్, (ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్)- 2, అసిస్టెంట్ డైరెక్టర్ (ఇ-లెర్నింగ్) / టి అండ్ డి - 1, మిషన్ మేనేజర్లు (శిక్షణ & అభివృద్ధి) / టి అండ్ డి- 2, ప్రాజెక్ట్ ఆఫీసర్ / టి అండ్ డి - 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ (ట్రైనింగ్ ఆపరేషన్స్) / టి అండ్ డి- 2, అసిస్టెంట్ డైరెక్టర్ / ఎం అండ్ ఇ - 1 పోస్టులున్నాయి.
వీటితో పాటు స్టేట్ టీమ్ మేనేజర్ / ఎం అండ్ ఇ - 1, ప్రాజెక్ట్ ఆఫీసర్లు (ఎం అండ్ ఇ) / ఎం అండ్ ఇ - 3, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు / MIS - 3, లీగల్ ఆఫీసర్ / ఎడిఎంఎన్ - 1, మేనేజర్ (హెచ్ఆర్) / అడ్మిన్ - 1, ప్రాజెక్ట్ అసోసియేట్ (హెచ్ఆర్ & అడ్మిన్) / అడ్మిన్ - 1, థిమాటిక్ (రీసెర్చ్ & పాలసీ) - 1, థిమాటిక్ (IEC & ICT) - 1, థిమాటిక్ (MIS) - 2, థిమాటిక్ (ఫైనాన్స్) - 1, ఆఫీస్ అసిస్టెంట్ - 1, కంటెంట్ మేనేజర్ - 1 పోస్టులున్నాయి.