నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెబీలో ఉద్యోగాలు, వివరాలు..!!
ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతోంది. ముఖ్యంగా పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. అలాగే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఇక ఇప్పటికే కరోనా మూడు లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. అయినప్పటికీ దీని ఆకలి తీరడం లేదు. మరోవైపు కరోనా ఎఫెక్ట్ ఉద్యోగులపై కూడా పడింది. కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.
అయితే ఇలాంటి సమయంలో భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI ఉద్యోగాల భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 147 పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెబీ. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. మరియు కరోనా కారణంగా దరఖాస్తు గడువు పొడిగించింది కూడా. అయితే ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు చివరి తేది 2020 మే 31. అంటే మరో ఆరు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 147 ఖాళీలు ఉండగా అందులో జనరల్- 80, లీగల్- 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22, ఇంజనీరింగ్- 5, రీసెర్చ్- 5, అఫీషియల్ లాంగ్వేజ్- 1 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థుల వయస్సు 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఇక దరఖాస్తుకు 2020 మే 31 చివరి తేదీ. ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2020 జూలై 4న, ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2020 ఆగస్ట్ 23న జరుగుతుంది. ఫేజ్ 2 ఫలితాల తర్వాత ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.