జూన్ 17 ప్ర‌త్యేక‌త‌లు ఇవే..ఏంటో తెలుసా..?!

Spyder

చ‌రిత్ర‌లో ప్ర‌తీ రోజూకు ఓ చ‌రిత్ర ఉంటుంది. ప్ర‌పంచ ప‌రిణామ క్ర‌మంలో, మాన‌వాళి గ‌మ‌నంలో ఆయా దేశాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సామాజిక‌, రాజ‌కీయ, ఆర్థిక‌, భౌగోళిక సంఘ‌ట‌న‌లు చ‌రిత్ర‌కెక్కాయి. ఎంతోమంది మ‌హానుభావులుగా మారారు. జూన్ 17న జ‌రిగిన సంఘ‌ట‌న‌ల సమాహారాన్ని మ‌రోసారి స్మ‌రించుకుంటూ హెరాల్డ్ అంద‌జేస్తున్న స‌మ‌చారం.


1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.
1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
1940: సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
1948: డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
1963: దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
1972: రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
1978: విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పడింది.
1987: డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
1991: సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.
ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డే జరుపుకుంటారు.
1994: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.
2012: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జననాలు
1239: మొదటి ఎడ్వర్డ్, ఇంగ్లాండు రాజు (మ.1307).
1682: చార్లెస్-12, స్వీడన్ రాజు (మ.1718).
1913: తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త (మ.1997).
1973: లియాండర్ పేస్, భారత టెన్నిస్ క్రీడాకారుడు .

మరణాలు
1631: ముంతాజ్ మహల్, ప్రసవ సమయంలో మరణించింది. ఆమె జ్ఞాపకార్ధం, ఆవిడ భర్త, మొగల్ చక్రవర్తి షాజహాన్ 1, ముంతాజ్ మహల్ సమాధిగా తాజ్ మహల్ ని 20 సంవత్సరాలు కష్టపడి నిర్మింపచేసాడు.
1858: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (జ.1828)
1946: చిలకమర్తి లక్ష్మీనరసింహం, ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867)

పండుగలు, జాతీయ దినాలు

ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం
జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)
బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: