ఇంట‌ర్ పాస్ అయ్యారా.. అయితే మీకోస‌మే ఈ ఉద్యోగాలు..!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కంటికి క‌నిపించ‌ని క‌రోనా భారీ స్థాయిలో విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే అన్ని దేశాలను చుట్టేసిన ఈ మ‌హ‌మ్మారి.. అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా.. ఆ ప్రాణాంతక వైరస్‌ విస్తరించడానికి అడ్డుకట్ట పడట్లేదు. ఇప్ప‌టికే ప్రపంచంవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,05,85,152కు చేరింది.మ‌రియు ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటివరకు మొత్తం 5,13,913 మంది మృతిచెందారు. ఈ లెక్క‌లు చూస్తుంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

 

ఇక మ‌రోవైపు క‌రోనా ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది.  క‌రోనా దెబ్బ‌కు న‌ష్ట‌పోతున్న ప‌లు కంపెనీలు అప్పుల భారం త‌ట్టుకోలేక.. త‌మ ఉద్యోగుల‌ను తొలిగిస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ రెండు నోటిఫికేషన్లకూ ఒకేసారి సెప్టెంబర్ 6న పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష ఒకేసారి నిర్వహించినా ఫలితాలు వేర్వేరుగా విడుదలవుతాయి. అలాగే రెండు నోటిఫికేషన్ల ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో 831 పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. 

 

అయితే ప్రస్తుతం రెండో నోటిఫికేషన్‌లోని 413 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.  మొత్తం 413 ఖాళీలు ఉండగా అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120), నావల్ అకాడమీ- 43 పోస్టులున్నాయి. ఇంటర్ లేదా 10+2 పాసైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 6 చివరి తేదీ. అంటే మ‌రికొన్ని రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక అడ్మిట్ కార్డుల్ని 2020 ఆగస్ట్‌లో రిలీజ్ చేస్తారు. 2020 సెప్టెంబర్ 6న పరీక్ష ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: