జూలై 15వ తేదీకున్న చరిత్ర అదే...తెలిస్తే ఆశ్చర్య పోతారు..!
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జూలై 15వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1893: విజయనగరం - విశాఖపట్నం మధ్య రైల్వే లైన్ మొదలయ్యింది.
2013: భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడింది.
జననాలు
1820: అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (మ.1886)
1885: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1970)
1895: చేబియ్యం సోదెమ్మ, ఆంధ్రరాష్టం గర్వపడే స్వాతంత్ర్య సమరయోధురాలు. సంఘసేవకురాలు
1899: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు . (మ.1977)
1901: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోకసభ సభ్యుడు. (మ.1985)
1901: వేముల కూర్మయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1970)
1902: కానూరు లక్ష్మణ రావు, ఇంజినీరు. (మ.1986)
1902: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976)
1909: దుర్గాబాయి దేశ్‌ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981)
1920: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006)
1920: కందాళ సుబ్రహ్మణ్య తిలక్, స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోకసభ సభ్యుడు (మ.2018).
1922: లియోన్ లెడర్‌మాన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత
1928: వీరమాచనేని విమల దేవి, భారతీయ కమ్యూనిష్టు పార్టీ నాయకురాలు, ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 3వ లోకసభ సభ్యురాలు.
1941: రావెల సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.
1942: నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
1964: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు.
పండుగలు , జాతీయ దినాలు
సోషల్ మీడియా గివింగ్ డే