సీఆర్పీఎఫ్లో పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!!
గత ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక వైరస్ కరోనా.. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను కమ్మేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు చిన్నా.. పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్‌కు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థంకావడం లేదు. దీంతో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం పెరిగిపోతోంది.
అయితే ఇలాంటి సమయంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 789 ఖాళీలు ఉన్నాయి. వీటి పూర్తి వివరాలు చూస్తే.. మొత్తం 789 ఖాళీల్లో.. ఇన్స్పెక్టర్- 1, సబ్ ఇన్స్పెక్టర్- 183, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్- 157, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ / ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్- 1, హెడ్ కానిస్టేబుల్- 197, కానిస్టేబుల్- 250 పోస్టులున్నాయి.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, దరఖాస్తుల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీగా ప్రకటించింది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్సైట్ https://www.crpf.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని.. దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని.. వెంటనే దరఖాస్తు చేసుకోవలెను.