జూలై 24కు చరిత్రలో ఎంతో ప్రాధాన్యం..విశేషాలేంటో తెలుసా..?
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జూలై 24వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.
1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.
జననాలు
1928: కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1936: మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.
1976: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, ఐటీశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు.1990-91 ఎస్ఎస్సీ, జీజీ స్కూల్, హైదరాబాద్.1991-93 ఇంటర్, విజ్ఞాన్ కాలేజీ, గుంటూరు.గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేసి హైదరాబాద్ వచ్చి మెడిసిన్ ఎంట్రెన్స్ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. 1996-98 ఎమ్మెస్సీ, (బయోటెక్నాలజీ) పూణే యూనివర్సిటీ, ముంబాయి. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.
మరణాలు
1862: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1899: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803)
1970: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890)
1971: గుర్రం జాషువా, తెలుగు కవి (జ.1895).
2000: ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924)
2014: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త (జ.1934)
2018: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (జ.1935)