ఓఎన్‌జీసీలో భారీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం!!
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) భారీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 4182 ఖాళీలు ప్రకటించింది. ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. వీటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఖాళీలు 4182 ఉండగా.. అందులో సదరన్ సెక్టార్- 674, నార్తర్న్ సెక్టార్- 228, ముంబై సెక్టార్- 764, వెస్టర్న్ సెక్టార్- 1579, ఈస్టర్న్ సెక్టార్- 716 మరియు సెంట్రల్ సెక్టార్- 221 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని వేర్వేరు సెక్టార్లలో 21 కేంద్రాల్లో ఈ పోస్టులున్నాయి.
సదరన్ సెక్టార్‌లో కాకినాడ, రాజమండ్రిలో కూడా ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థల వయస్సు 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే స్టాట్ అయింది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 17 చివరి తేదీగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ongcindia.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కాగా, అసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవలెను.