ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. అర్హ‌త ఏంటంటే..?

Kavya Nekkanti
ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైర‌స్ కంటికి క‌నిపించ‌కుండా.. ఎంతో మంది జీవితాల‌ను నాశ‌నం చేస్తోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు  దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ఎన్నో కంపెనీలు మూత‌ప‌డ్డాయి. ఎంద‌రో ఉద్యోగులు రోడ్డున ప‌డ్డారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తూ.. 132వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం మొత్తం 40 ఖాళీల‌ను ప్ర‌క‌టించింది ఇండియ‌న్ ఆర్మీ. డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 2021 జనవరిలో వీరిని నియమిస్తారు. ఇక ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 40 ఖాళీలు ఉండ‌గా.. అందులోసివిల్ ఇంజనీరింగ్- 10, ఆర్కిటెక్చర్- 01, మెకానికల్ ఇంజనీరింగ్- 03, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 4, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫోటెక్ / ఎంఎస్సీ కంప్యూటర్- 09, న్యూక్లియర్ టెక్నాలజీ- 01, ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 01 పోస్టులు ఉన్నాయి.

వీటితో పాటు ఏరోనాటికల్ / ఏవియానిక్స్- 02, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / శాటిలైట్ కమ్యూనికేషన్- 06, ఏరోస్పేస్- 01, ఇండస్ట్రియల్ / మ్యానిఫ్యాక్చరింగ్- 01 మ‌రియు లేజర్ టెక్నాలజీ- 01 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అది కూడా పెళ్లికాని యువకులు మాత్రమే. వారి వ‌య‌స్సు 20 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 26 చివరి తేదీగా ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇండియ‌న్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ https://joinindianarmy.nic.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: