అలర్ట్.. టాటా మెమొరియల్ సెంటర్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్!!
టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, నర్స్, ఫోర్‌మెన్, ఆఫీసర్ ఇంఛార్జ్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, సూపర్వైజర్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, సైంటిఫిక్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 146 ఖాళీలు ఉన్నాయి. వీటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 146 ఖాళీలు ఉండగా అందులో నర్స్ ఏ- 49, జూనియర్ ఇంజనీర్ (బయో మెడికల్)- 01, ఫోర్‌మ్యాన్- 05, సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 58, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్- 02, అసిస్టెంట్ డైటీషియన్- 03, కిచెన్ సూపర్వైజర్- 01, హౌజ్‌కీపింగ్ సూపర్వైజర్- 01, కోఆర్డినేటర్ బీ- 08, ఫార్మాసిస్ట్ బీ- 04 ఖాళీలున్నాయి.
వీటితో పాటు టెక్నీషియన్- 04, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎడిమమియాలజీ)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 02, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (రేడియోఫార్మసిస్ట్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ సీ (రేడియోఫార్మసిస్ట్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ సీ (న్యూక్లియర్ మెడిసిన్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (కంప్యూషనల్ ఇమేజింగ్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ సీ (క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్)- 01, ఆఫీసర్ ఇంఛార్జ్ (డిస్పెన్సరీ)- 01 పోస్టులున్నాయి.
విద్యార్హత విషయానికి వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ వివరాలను నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://actrec.gov.in/ లేదా https://tmc.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 7 చివరి తేదీగా టాటా మెమొరియల్ సెంటర్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది కాబట్టి, అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవలెను.