నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీలో ఉద్యోగాలు.. అర్హ‌త ఏంటంటే?

Kavya Nekkanti
ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా మ‌హ‌మ్మారి ఉచ్చులో చిక్కుకుని విల‌విల‌లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌కు చుక్క‌లు చూపిస్తోంది. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. అడ్డు అదుపు లేకుండా క‌రోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మ‌రోవైపు కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది జీవనోపాధిని కోల్పోతున్నారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొద్ది నెలల క్రితం వరకు ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నంతలో హ్యాపీగా గడిపిన వారు ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డుతున్నారు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో ప‌లు కంపెనీలు ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ (ఎన్ఐఈ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 52 ఖాళీలు ఉన్నాయి. ప‌్రాజెక్ట్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్ త‌దిత‌ర విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తోంది నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ.

విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణ‌తతో పాట నిర్దిష్ట అనుభ‌వం కూడా ఉండాల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక విధానం ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపిక అయిన వారికి రూ.18 వేల నుంచి రూ.64 వేల వరకు వేతనం ఉంటుంది.  30-40 ఏళ్ల మధ్య ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం అయింది.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆగస్టు 24, 2020 చివ‌రిగా తేదీగా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని..  ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవ‌లెను. nieprojectcell@nieicmr.org.in ఈ-మెయిల్ ఐడీకి ద‌ర‌ఖాస్తు పంపాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను https://nie.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: