ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!!
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ ప్రతీ ఏటా 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నియామకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఇదే స్కీమ్‌పై ఉద్యోగాలు భర్తీ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. పోస్టుల పూర్తి వివరాలు చూస్తే.. మిత్తం 90 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల సంఖ్య పెరగొచ్చని ఇండియన్ ఆర్మీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. విద్యార్హత విషయానికి వస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి.
అలాగే కనీసం 70 శాతం మార్కులు ఉండాలని నోటిఫికేషన్‌లో ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు.. 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలలు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 10 నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తు చేసుకోవడానికి 2020 సెప్టెంబర్ 9గా నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని.. వెంటన దరఖాస్తు చేసుకోవలెను. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ https://www.joinindianarmy.nic.in/ తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.