ఆగస్టు 26వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను. ...మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఆగస్టు 26వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
1982: భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.
2008: తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.
జననాలు
1451: క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (మ.1506). ఇటలీకి చెందిన ఒక నావికుడు, ప్రపంచ యాత్రికుడు. స్పెయిన్ రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రం పై ఆయన సాగించిన యాత్ర, పశ్చిమార్థగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది. కొలంబస్ 1451లో ఆగస్టు, అక్టోబరు మధ్య నవీన ఇటలీలో భాగమైన జెనోవాలో జన్మించి ఉండవచ్చునని చాలామంది భావన. ఈయన కచ్చితమైన జన్మదినంపై వాదోపవాదాలున్నాయి. ఈయన తండ్రి పేరు డొమెనికో కొలంబో. ఒక మధ్య తరగతి ఉన్ని వస్త్రాల నేతగాడు.
1743: ఆంటోనీ లెవోషియర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794)
1873: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961) లీ డి ఫారెస్ట్ (ఆగష్టు 26, 1873 - జూన్ 30, 1961) తన ఖాతాలో 180 పైగా పేటెంట్లను వేసుకున్న ఒక అమెరికన్ ఆవిష్కర్త. ఇతను "కనిపించని గాలి యొక్క రహస్య సామ్రాజ్యాన్ని నేను కనుగొన్నాను" అనే ప్రసిద్ధ వ్యాఖ్యతో తనకు తానే "రేడియో పితామహుడు" (ఫాదర్ ఆఫ్ రేడియో) అనే పేరు పొందాడు. చలన చిత్రాల తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి వార్నర్ సోదరులు ఓ సంచలనాత్మక విజయం సాధించగా, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను లీ డి ఫారెస్ట్ కనిపెట్టారు.
1906: ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993)
1910: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
1956: మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
1963: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008)
1964: సురేష్, తెలుగు సినీ నటుడు.
1965: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు, రచయిత.
1968 : సౌందర్య రాజేష్, మహిళా పారిశ్రామికవేత్త