గుడ్ న్యూస్: డీఆర్డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మూడు రోజులే గడువు..!
ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు. ఇక దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని తెలిపారు. ఇక అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుందని తెలిపారు. మొత్తం 90 ఖాళీలు ఉండగా అందులో ఐటీఐ ఇన్ ఫిట్టర్- 25, ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్- 20, ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్- 15, ఐటీఐ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 10, ఐటీఐ ఇన్ టర్నర్- 10, ఐటీఐ ఇన్ మెషినిస్ట్- 5, ఐటీఐ ఇన్ వెల్డర్- 5 పోస్టులున్నాయని వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్ కి విద్యార్హత వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయన్నారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో రెగ్యులర్ ఐటీఐ పాస్ అయినవారు అప్లై చేయాలన్నారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ పాసైనవారు మాత్రమే అర్హులు. స్టైపెండ్ రూ.7,700 నుంచి రూ.8050 లభిస్తుందన్నారు. డీఆర్డీఓలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్-MSDE వెబ్సైట్ www.apprenticeshipindia.org ఓపెన్ చేయాలి. Register పైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.