నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 50 వేల వేతనంతో ఉద్యోగాలు..!

Kothuru Ram Kumar
నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శుభవార్త చెప్పారు. ఈ నోటిఫికేషన్ లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఉత్తరాఖండ్ లోని కొట్వాడ యూనిట్లో ఈ నియామకాలు చేపట్టనున్నారని అధికారులు తెలిపారు. 50 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ట్రైనీ ఇంజనీర్ మరియు ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మూడేళ్ల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారికి రూ. 31 వేల వరకు వేతనం లభిస్తుంది.ఈ నోటికేషన్ లో మొత్తం 33 పోస్టుల్లో 19 ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధం అవుతుంది. ఇక ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అర్హతతో 10, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో 2, మెకానికల్ ఇంజనీరింగ్ 5, సివిల్ ఇంజనీరింగ్-1, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 1 పోస్టును భర్తీ చేయనున్నారు. 11 ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ కానున్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అర్హత ఉన్న వారికి 5, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అర్హత ఉన్న వారికి 6 ఖాళీలు ఉన్నాయి.

ఇక ట్రైనీ ఆఫీసర్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. అయితే ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవాడనికి అర్హులు అని తెలిపారు. ఇక ప్రాజెక్ట్ అధికారి విభాగంలో 1 పోస్టు ఖాళీగా ఉంది. ఎంబీఏ లేదా MSV విద్యార్హత కలిగిన వారు ఇందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించడానికి ఆసక్తి కలిగిన వారై ఉండాలని నోటిఫికేషన్ లో వెల్లడించారు. జాబ్ పోస్టింగ్ ఉన్న ప్రదేశాలకు రీ లొకేట్ కావడానికి సిద్ధంగా ఉండాలి.

అయితే ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి 21 వరకు BEL అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.. ఇక ట్రైనీ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆఫీసర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను పైన ఇచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఆసక్తి కలిగిన అభ్యర్థులు  www.bel-india.in ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: