డిగ్రీ విద్యార్థులకు IISC -KVPY ఉపకారవేతనం నెలకు 5వేలు - దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 30

SS Marvels

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగళూరు.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) ద్వారా డిగ్రీ సైన్స్‌ విద్యార్థులకు నెలకు రూ.5 వేలు స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరపున ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి.


ఆసక్తి ఉన్నవిద్యార్థులు https://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. గతంలో ప్రకటించిన దరఖాస్తు గడువును తాజాగా పొడిగించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈనెల (అక్టోబర్‌) 30 దరఖాస్తుకు చివరి తేది. విద్యార్థులు దరఖాస్తు చేసే ముందు https://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో ఈ ఫెలోషిప్‌కు సంబంధించిన ప్రకటన పూర్తిగా చదివి తమకు తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం: