ఏపి ఎంబీబీఎస్ , దంత వైద్య విద్యకు సంబందించిన కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ ఇటీవల రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచనల మేరకు ఫీజులు తగ్గిస్తూ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జీఓ నెంబర్ 146ను జారీ చేసింది. దీంతో ప్రైవేట్ వైద్య కాలేజీల్లో యాజమాన్య కోటా కింద వైద్య విద్య అభ్యసించే ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.వీటికి సంబంధించిన ఫీజులను ఖరారు చేసారు..
ఈ ఫీజులు ప్రైవేట్ , మైనారిటీ కాలేజీలకు ఆ ఫీజులు వర్తిస్తాయి.. అని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇకపోతే ఇప్పటివరకు ఎంబీబీఎస్ ఐదేళ్ల ఫీజులను కాలేజీలు తీసుకుంటున్నారు.. అయితే ఈ ఏడాది నుంచి నాలుగున్నర ఏడాది వరకు మాత్రమే తీసుకోవాలని సూచించారు..ఈ ఏడాది నుంచి 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపారు.. కాగా, 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులు నిర్ణయించారు. ప్రైవేట్ వైద్య కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేట్ కాలేజీ అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఫీజుల చెల్లింపులు పూర్తి అయిన నేపథ్యంలో వైద్య విద్యలోని ప్రత్యేక కోర్సులలో ప్రవేశాలు కొరకు ప్రక్రియను పూర్తి చేసే పనిలో పడ్డారు..ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. తొలి విడుత కౌన్సిలింగ్ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.నోటిఫికేషన్ ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకి ఎ,బి,సి కేటగిరీ ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సూచనల ప్రకారం నిర్ణయించామని తెలిపారు.. బీడీఎస్ ప్రవేశాలను కూడా అదే తరహాలో ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు..