
ఎలాంటి పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్స్ ను పొందే అవకాశం..వివరాలు ఇవే..
ఈ మధ్య కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి ఆలోచన చేసినట్లు తెలుస్తుంది..ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు, కొత్త జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సైతం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టింది.. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి.. ఈ జాబ్ నియామకాలను చేపట్టే ఆలోచనలో బ్యాంక్ ఉన్నట్లు తెలుస్తుంది.ఈ బ్యాంక్ సంబందించిన ఉద్యోగాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీ ఉన్న పోస్టులు..డిప్యూటీ జనరల్ మేనేజర్ - 11 పోస్టులుఅసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 52 పోస్టులుమేనేజర్ - 62 పోస్టులుఅసిస్టెంట్ మేనేజర్ - 9 పోస్టులు
ఐడీబీఐ బాంకు ఉద్యోగాల ను బట్టి అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ లేదా ఎంసీఏ లాంటి విద్యార్హత కలిగి ఉండాలి. మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు సైతం ఎంబీఏ, పీజీడీడీఎం, ఏజీఎం చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అనుభవం గురించి లేదా ఉద్యోగాల గురించి https://www.idbibank.in/ ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ అప్లైఎంపిక: దరఖాస్తులలోని అర్హతలు, అనుభవం ఆధారంగా ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఆపై షార్ట్ లిస్ట్ అయిన వారిక గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూఫీజు: జనరల్, ఈబీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 24, 2020దరఖాస్తుకు చివరి తేది: జనవరి 7, 2021