అమ్మాయిలకు శుభవార్త ప్రకటించిన ఇంటర్న్ శాల!
పూర్తి వివరాల్లోకి వెళితే ఇంటర్న్ శాల ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వారి కోసమే సరికొత్త స్కాలర్షిప్ పేరిట వారికి ఆర్థికంగా సహాయపడాలనుకుంటోంది. ఇందుకోసం 17 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలు అర్హులు అని సూచిస్తోంది. స్టడీ,స్పోర్ట్స్ వంటి తదితర రంగాలకు సంబంధించిన అమ్మాయిలు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అమ్మాయిలు ఇందుకోసం చేయవలసిందల్లా వారి వయస్సు, విద్యార్థినిలు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు,సాధించిన విజయాలు,స్కాలర్ షిప్ ను పొందితే ఈ స్కాలర్ షిప్ను ఎందుకు వినియోగిస్తారు? అనే విషయాలకు సంబంధించి స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ విధానం జరుగుతుంది.
అయితే ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలకు టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరగుతుంది.https://blog.internshala.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ 15 జనవరి 2021.ఈ లింకు ఓపెన్ చేయగానే అక్కడ మీ చదువుతో పాటు మీ పూర్తి వివరాలు అక్కడ నమోదు చేసుకోవాలి. స్కాలర్షిప్ ఎంపిక విధానం తర్వాత సెలెక్ట్ అయిన ప్రతి ఒక అమ్మాయికి 25 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు ఇంటర్న్ శాల ప్రకటించింది.