మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

యుగాలనాటి మహాభారతంలొ ఉన్నదే నేడూ జరుగుతుంది. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువే ఉంది. ఇది ఇతిహాసం కాదు నిజమైన చరిత్ర. నేడు మనం రోజు వింటున్న, చూస్తున్న, చదువుతున్న "వివాహేతర శృఙ్గారం" నాటి అడుగు జాడల ఆనవాళ్లే.



లక్షల సంవత్సరాల చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉండి, అసాంఘికమని నేడు మనం ఘోషిస్తున్న అపవిత్ర కార్యం కళ్ళకు కట్టినట్లు కనిపించే కథ. కారణం జన్ముల అపవిత్ర సంగమం "తార శశాంకం" ఫలితంగా "ఆడ మగా కానీ – “బుధగ్రహ” జననం" ప్రతి అసాంఘిక కార్యానికి ఎదో “లోక కళ్యాణం” అనే పేరు.




పంచమ వేదమైన మహాభారతంలో వివిధ అంశాల గురించి వేదవ్యాసుడు చర్చించాడు. ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక అంశాలతో పాటు శాస్త్ర సాంకేతికతలను కూడా మేళవించాడు. ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ, ఇందులోని పాత్రలను, మనుషులను, జంతువులను, యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష, గణ తదాది దేవతల గురించి అనేక విషయాలు పొందుపరిచాడు.




అంత పెద్ద ఉద్గ్రంధంలోని చిన్న భాగాన్ని "శేషము వేంకటపతి" అనే దిగ్గజ ప్రబంధ రచయిత “తార శశాంకం” అను పేరుతో అనిర్వచనీయం గా రాశారు. అప్పటి సమాజం దీన్ని నిషెదించింది. చివరకు చర్చోప చర్చల అనంతరం "మేధావులకు మాత్రమే" అంటే స్కాలర్స్ ఎడిషన్, అన్నట్లు పరిగణించారు. నేడు “పెద్దలకు మాత్రమే” అన్న సినిమాను పిల్లలు నిరభ్యంతరంగా చూస్తున్నట్లు జనబాహుళ్యంలో తారాస్థాయిగా నిలిచిపోయింది.




దీనిని “అర్ధవంతంగా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా చూడాలి తప్ప, విమర్శనాత్మకంగా చూడటంవల్ల ఆంతర్యాన్ని స్పృశించలేరు” - అనే టాగ్ లైన్ ఒకటి తగిలించారు.



ఇంద్రుడు తన ఆస్థాన పురోహితుడిగా బృహస్పతిని నియమించాడు. ద్వాపర యుగంలో మనుషుల జీవితాలలో యఙ్ఞాది క్రతువులు ముఖ్య అంశం గా ఉండేవి. అందువల్ల పురోహితుడికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. బృహస్పతి భార్య తార. (బృహస్పతి అంటే గురుగ్రహం - తార అంటే అందమైన నక్షత్రం) ప్రాచీన భారతదేశం లోని స్త్రీ పురుషులిద్దరికి క్రతువులలో సమాన ప్రాధాన్యత ఉండేది.




ఎట్టి పరిస్థితిల్లోనూ సాంఘికంగా స్త్రీని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేకుండా ఆచారాలుండేవి. పురుషుడు శారీరక బలంతో స్త్రీ పై పూర్తి విజయం సాధించ గలడు కానీ, ఆధ్యాత్మిక విషయాలలో ఆమె పక్కన లేకపోతే ఏదీ సాధ్యం కాదు. అందుకే స్త్రీ పక్కన లేని పురుషునికి ఆధ్యాత్మికంగా విలువ ఉండెది కాదు


ఇంద్రుడుకి పురోహితుడైన బృహస్పతి అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకుని తన భార్య తారను నిర్లక్ష్యం చేశాడు. అయినా తన పౌరోహిత్య విధి నిర్వహణలొ మాత్రం ఆమె తన పక్కన ఉండటం ఎంతో ముఖ్యం. తార లేకపోతే తన ఉపాధి పోతుందని ఆమెను వదలలేదు.




ఈ విషయం తెలిసిన సౌందర్య రసాధిదేవత, విదుషీమణి అయిన తార, తన ముదుసలి భర్త తనను నిర్లక్ష్యం చేయటం సహించక - ఆకాశంలో పున్నమి చంద్రుని చూసి ప్రేమలో పడింది. చంద్రుడు కూడా ఆమెను మోహించడంతో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించి, కొంతకాలం తర్వాత తార చంద్రునితో వెళ్లిపోయింది అంటే 'వివాహేతర శృఙ్గారానికి ఆజ్యం' పోసిందన్నమాట.



ఉద్యోగం, గౌరవం, దేవలోకంలో తన స్థానం కూడ తారతోనే తరలిపొతుందని ఇక ఇక్కడ అంటె దెవలొకంలొ అడుగు పెట్టలేనని గ్రహించిన బృహస్పతి ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఇంద్రుడుతో "నాకు నా భార్య కావాలి, నువ్వు ఆమెని తిరిగి తీసుకురావాలి, లేకపోతే నేను మీ క్రతువు లను నిర్వహించనని’ మొండికేసాడు. గురుదేవుడు, దేవ గురువు, బ్రహస్పతి మాటతో ఈ అసాంఘిక కార్యాన్ని సరిదిద్దటానికి అంటె ఇల్లీగాలిటీని లీగలైజ్ చెసేపనికి, పూనుకున్నాడు దేవేంద్రుడు. 




తారని సంప్రదించి - తిరిగి రావాలని, పాతివ్రత్య ధర్మ ప్రభోదం కావించాడు. సామాజిక ధర్మాన్ని విశదీకరించాడు. ఒత్తిడి చేశాడు. కుటుంబ వ్యవస్థలో ఉండాలని ఒకరిని ఒత్తిడి చేయడం భారతీయ గ్రంధాల్లో ఇదే తొలిసారి. ‘నువ్వు తిరిగి రావాలని ఇంద్రుడు పేర్కొంటే, నా ప్రేమ చంద్రునితో అని తార నిరాకరించింది. ‘నీ భావాలతో పని లేదు వివాహబంధం ద్వారా సంక్రమించిన ధర్మం బృహస్పతితో నీవు ఉండటం, పైగా నువ్వు లేకపోతే నా క్రతువులు జరగవని తారను ఇంద్రుడు ఒక రకంగా 'బ్రెయిన్వాష్' చేసి తిరిగి తీసుకొచ్చి బ్రహస్పతికి అప్పజెప్పాడు.


అప్పటికే తార గర్భవతి. చంద్రుని అంశ ఆమెలో నిక్షిప్తమై ఉంది ఆ విషయం తెలిసిన బృహస్పతి దీనికి కారణం ఎవరని అడిగితే, పబ్లిసైజ్ చేయటానికి ప్రయత్నిస్తె, తార మాట్లాడడానికి నిరాకరించింది. దేవతలు అందరూ విచ్చేశారు. తార ఇంకా మౌనంగానే ఉంది.

ఇంతలో గర్భం లోని శిశివు ‘నిజంగా నేనెవరి సంతానం?’ అని ప్రశ్నించాడు. ఆ శిశువు తెలివికి అక్కడున్న వారంతా నీ భర్తకు, దేవతలకు చెప్పడానికి నువ్వు నిరాకరించవచ్చు, కానీ పుట్టబోయే బిడ్డకు నువ్వు తప్పక చెప్పాలని అన్నారు. దీంతో తార ఈ శిశువు చంద్రుని సంతానం అని చెప్పింది. "తల్లి యదార్ధం. తండ్రి మిధ్య" అని లోకోక్తి. ఇలాంటప్పుడే ప్రాచుర్యంలోకి వస్తాయి పలు సామెతలు. ఎవరికైనా కన్న తల్లి గర్భజనితం వల్ల తెలుస్తుంది. నిజమైన తండ్రెవరో తల్లి చెపితే తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి తండ్రి మిధ్య అంటారు.

తన భార్య పరపురుషుడి వల్ల సంతానానికి జన్మనిస్తుందని తెలిసిన బృహస్పతి ఆగ్రహంతో ఊగిపోయాడు. స్త్రీ, పురుష రూపం కాక, నువ్వు “నపుంసకుడు” గా ఉంటావని గర్భస్థ శిశువును శపించాడు బృహస్పతి. జన్మించిన శిశువుకు బుధ గ్రహాన్ని సూచిస్తూ ‘బుధ’ అని పేరు పెట్టారు. బుధుడు తారా చంద్రుల 'వివాహేతర సంగమం' లో అంటే అక్రమ అసాంఘిక కలయికలో, పుట్టినా కూడా, జన్మతః మాతృపితృ కారకంగా - "కారణజన్ముడు" అయినాడు. నవగ్రహాలలో ఒకడై మన జీవితాలను శాసిస్తున్నాడు.

బుధుడు పెరుగుతూ నేనెలా బతకాలి ఆడా? మగా? కాకుండా. నేనేం చేయాలి? నా ధర్మం ఏమిటి? నేను వివాహం చేసుకుని గృహస్తుడిగా ఉండగలనా? సన్యాసం తీసుకోవాలా? పెళ్ళి ఆడవారితోనా, లేక మగవారితోనా? అని వాపోయాడు. ఈ విశ్వంలో కోట్ల కొద్దీ నక్షత్రాలకి చోటుంది, స్త్రీ పురుషులు, దెయ్యాలు, దేవతలుకాక పోయినా మిగతావాటికి స్థానం ఉంది. వీటన్నిటికీ స్థానం ఉండగా, నీకు చోటు లేదని చింతించకు, నువ్వు నిశ్చింతగా ఉండు నీ జీవితం నీ దారికే వస్తుందని, ప్రతి జన్మకు ఒక కారణం, ఒక కర్తవ్యమ్ ఉంటుందని తన పుత్రుడైన బుదుణ్ణి ఊరడించింది తార.

అందుకే అక్రమ సంగమ జనితులకు ఎదో ఒక లోపం ఉండటం, కనిసం మానసిక వికాసం లేని వికారం ఉండటం - నిశిత పరిశీలకులకు నేటికీ తెలుస్తూనే ఉంది.

5000 వేల సంవత్సరాల ముందు నివసించిన మనుష్యులను ఈనాటి సామాజిక విలువలతో, నీతులతో పోల్చటం, తద్వారా తీర్పు చెప్పటం అన్యాయం. మనం మనలా కాకుండా, వారిలాగా నాటి పరిస్థితుల పరిధిలో ఉండి ఆలోచించాలనీ, వారి అనుభవం - మనం అనుభూతి చెందాలని అప్పుడు మాత్రమే కాలానుగుణంగా సమాజంలో వచ్చిన మార్పులు అర్ధమౌతాయన్నది గుర్తించాలి. 

ఈ కథ జరిగిన కాలంలో భూమికీ మరింకెక్కడో ఉన్న జీవులకీ మధ్య - అంటే మానవులకు దేవుళ్ళకు, దేవతలకు - మరో రకంగా చెప్పాలంటే గ్రహాంతర జీవులకు - ఇచ్చిపుచ్చుకున్న  సందర్భాలు తరుచుగా జరుగుతుండేవి అన్నది గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: