నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..

Satvika
తెలంగాణ సర్కార్ యువత భవిష్యత్ కోసం కొత్త ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ యూనిట్‌ లో ఈ ఖాళీలున్నాయి. ఇవి ఏడాది గడువున్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను  దృష్టి లో ఉంచుకొని పెంచేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.


వివిధ విభాగాల్లో నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 మార్చి 18 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.ecil.co.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.. ఆసక్తిగల విద్యార్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. పూర్తి వివరాలు ఇలా..

మొత్తం ఉన్న ఖాళీలు..9

టెక్నికల్ ఆఫీసర్- 8

సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 1


ఉద్యోగాలకు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశాలు ఇవే..

దరఖాస్తుల స్వీకరణ : మార్చి 4 నుంచి ప్రారంభం..

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 18
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ- తేదీలను త్వరలో వెల్లడించనున్న ఈసీఐఎల్
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి.
వేతనం- టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.23,000
సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ ఉద్యోగానికి రూ.20,202.
వయస్సు- టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి 30 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ ఉద్యోగానికి 25 ఏళ్లు.


ఆసక్తి కలిగిన విద్యార్థులు పైన తెలిపిన లింక్ ను తెరచి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: