నిరుద్యోగ యువతకు ఆర్టీసీ గుడ్ న్యూస్.!

తెలంగాణ లో ఆర్టీసీ సంస్థలో డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని టీఎస్ఆర్టీసీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొదటి శిక్షణా తరగతులను జగిత్యాల లో ప్రారంభించింది. ప్రస్తుతం జగిత్యాలలో మూడో బ్యాచ్ శిక్షణ పొందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక డిపోలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్ డ్రైవర్ లతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది. జనవరి 17 రాష్ట్రంలోని మొదటి శిక్షణ తరగతి ని జగిత్యాలలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ కు శిక్షణ ఇస్తున్నారు. కరీంనగర్ డిపో ఆధ్వర్యంలోనూ శిక్షణ ఇస్తున్నారు. నిరుద్యోగులు, డ్రైవింగ్ పై ఆసక్తి ఉన్నవారు ఈ శిక్షణ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక నెలరోజుల పాటు బ్యాచ్ కు శిక్షణ ఇస్తారు. ఒక్క బ్యాచ్ లో 16 మందికి మాత్రమే శిక్షణ ఇస్తారు. అంతే కాకుండా ఒక్కో అభ్యర్థి నుండి శిక్షణ ఫీజు రూ.15,600 వసూలు చేస్తారు. ఒకవేళ ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే ప్రభుత్వమే ఫీజును బరిస్తుంది.

శిక్షణ లో కేవలం డ్రైవింగ్ మాత్రమే నేర్పించకుండా ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దేలా ప్రణాలికను రూపొందించారు. మొదటి ఐదురోజులు బస్సు కండిషన్, విడిబాగాలు, బ్రేక్ డౌన్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇస్తారు. మొదటి 5 రోజులు థియరీ తరగతులు నిర్వహించి...మరో 25 రోజులు డ్రైవింగ్ నేర్పిస్తారు. ఆర్టీసీ తీసుకువచ్చిన డ్రైవింగ్ స్కూల్ తో సంస్థకు ఆదాయం తో పాటు నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరుతుంది. ముఖ్యంగా జగిత్యాల నుండి ఎక్కువ మంది నిరుద్యోగులు గల్ఫ్ దేశాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారు డ్రైవింగ్ లో శిక్షణ తీసుకోవడం వల్ల గల్ఫ్ లో మంచి అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా శిక్షణ తో పాటు ట్రైనింగ్ తరవాత ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: