ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై దేశమంతటా ఒకే పరీక్ష.. సెప్టెంబర్ లో ఎలిజిబిలిటీ టెస్ట్..!

Divya

ఇకపై ఒక్కో ప్రభుత్వ ఉద్యోగానికి ఒక్కో పరీక్ష రాసే రోజులు పోయాయి . ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని పరీక్షలకు పులిస్టాప్ పెట్టి,  కేవలం ఒక్క పరీక్ష ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు అయ్యేలాగా కేంద్రం భావిస్తోంది . ఇక అందుకు అనుగుణంగా  ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (CET) ని ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో  CET నిర్వహించడానికి నేషనల్ ఏజెన్సీ  ( NRA) ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

" యువతకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడానికి, ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి ఈ సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా CET ni నిర్వహించడం జరుగుతుంది"  అని మంత్రి  జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు.


ఈ పరీక్ష  సెప్టెంబర్ లో లేదా ఈ సంవత్సరం చివర్లో ఉండవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత జోక్యం, యువత పట్ల ఆయనకున్న లోతైన శ్రద్ధ వల్ల ఈ విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ NRA.. గ్రూప్  బి,సి ( నాన్-టెక్నికల్ )  పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడం, ఎంపికైన అభ్యర్థుల వివరాలను షార్ట్ లిస్ట్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. ఎన్ఆర్ఎ ఏర్పాట్లలో భాగంగా దేశంలో ప్రతి జిల్లాలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా దూర ప్రాంతాలలో ఉండే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన ప్రతి అభ్యర్థికి అవకాశం కల్పించడమే ఈ చారిత్రాత్మక సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో మహిళలు, దివ్యాంగుల అభ్యర్థులు పరీక్షలు రాయడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన విధానంతో మహిళలు,దివ్యాంగులు ఆర్థిక స్తోమత లేని అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల చేరువవుతాయని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు  (RRB),  ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) ద్వారా నియామకాలకు సంబంధించి ఎన్నారై ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తోందని, అభ్యర్థులను షార్ట్ లిస్ట్  చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: