నీట్ పీజీ పరీక్షలు మరో 4 నెలలు వాయిదా..
కానీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేస్తున్నట్టు ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ పరీక్షలను మరో నాలుగు నెలల పాటు వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు చికిత్స చేస్తూ.. సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
100 రోజులు కొవిడ్ విధుల్లో ఉన్న పీజీ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను కూడా ఎన్ బీఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విడుదల చేసింది. విద్యార్థులు తదుపరి పరీక్ష వివరాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు కూడా త్వరలో అధికారిక వెబ్‌సైట్ http/nbe.co.in ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది... అటు ఏపి లో కూడా పది పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.. కరోనా విజృంభణ ఎక్కువ కావడంతో ఈ ఏడాది కూడా పరీక్షలు, అలాగే తరగతులు జరగనట్లే అని కొందరు అభిప్రాయపడుతున్నారు..