తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ భారీ షాక్..

Satvika
తెలంగాణ ఉద్యోగుల ఆశలపై సర్కార్ నీళ్ళు చల్లే ప్రయత్నం చేసింది..రాష్ట్రంలోని ఉద్యోగుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 30p శాతం ఫిట్‌మెంట్‌ ను అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ పెంచిన వేతనాలను ఏప్రిల్ నుంచి వర్తించేస్తామని ఆసమయంలో సీఎం స్యంగా ప్రకటించారు. అయితే.. మే 1న తీసుకునే వేతనంలో పెరిగిన జీతం ఉద్యోగులకు అందాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో వేతనాల పెంపు ఫైల్ పై ఆయన సంతకం చేయలేదు. దీంతో మేలోలో పెరిగిన వేతనాలను ఉద్యోగులకు ఇవ్వలేదు..

హామీ ఇచ్చి రెండు నెలలు పూర్తి అయినా కూడా  కేసీఆర్ జీతాల పెంపు ఫైల్ పై సంతకం చేయలేదు.జూన్ 1న కూడా ఉద్యోగులు పాత వేతనాలనే అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులను తయారు చేయడం, వాటిని ట్రెజరీలకు పంపించడం లాంటి పనులను 20వ తేదీ వరకు పూర్తి చేస్తారు.జూన్ లోనూ పాత వేతనాలే ఉద్యోగులకు అందనున్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో సర్కార్ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక పరిస్థితి పూర్తిగా పడిపోయింది.. ప్రభుత్వ రాబడి తగ్గింది. ఈ నేపథ్యంలోనే వేతనాల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ జీతాల పెంపు పై క్లారిటీ ఇస్తారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. దీంతో  ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కరోనా రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలను జారీ చేశారు. మరి కరోనా తగ్గేది ఎప్పుడు జీతాలు పెంచేది ఎప్పుడో అని ఉద్యోగులు నిరాశలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: