ఆధార్ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలు ఇవే..!

Satvika
ప్రభుత్వ సంస్థ ల్లో ఉన్న ఉద్యోగాల ను పూర్తి చేసెందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విభాగా ల్లో ఉన్న  ఖాళీలను భర్తీ చేశారు. ఇప్పుడు మరో ప్రభుత్వ సంస్థ లో ఉన్న ఉద్యోగాల నోటిఫికెషన్ ను విడుదల చేశారు. ఆధార్ కార్డు సేవల్ని అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముంబై, బెంగళూరు, గువాహతి లోని ప్రాంతీయ కార్యాలయాల్లో పలు ఖాళీల ను భర్తీ చేస్తోంది.
ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది డిప్యూటేషన్ మూడేళ్లు ఉంటుంది.ఈ పోస్టుల కు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2021 జూలై 16 లోపు ఉద్యొగాల కు అప్లై చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆఫ్‌లైన్ పద్ధతి లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యొగాల కు సంబంధించిన పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు- 25
డిప్యూటీ డైరెక్టర్- 3
సెక్షన్ ఆఫీసర్- 5
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5
సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 1
అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- 1
అకౌంటెంట్- 2
ప్రైవేట్ సెక్రెటరీ- 6
స్టెనో- 2
ఉద్యోగాల ముఖ్య విశేషాలు..
దరఖాస్తు ప్రారంభం- 2021 మే 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 16
విద్యార్హతలు- వేర్వేరు పోస్టుల కు వేర్వేరు విద్యార్హత లున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌ లో తెలుసుకోవచ్చు.
వయస్సు- 18 నుంచి 56 ఏళ్లు
ఎంపిక విధానం- విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వాళ్ళు పూర్తిగా చదివి అప్లై చేసుకొవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: