ఏపి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు..

Satvika
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ను అందించింది.. భారత దేశ రైల్వే శాఖ లో పని చేయాలనీ అనుకునేవారికి గుడ్ న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తో పాటు భారతీయ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్, రైల్వే జోన్లు ఉద్యోగాల భర్తీకి వేర్వేరు గా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. అందులో భాగంగా సదరన్ రైల్వే 3378 పోస్టుల్ని భర్తీ కి నోటిఫికేషన్‌ విడుదలైంది.. అది కూడా ఓ ప్రకటన రూపం లో వెల్లడించారు.


ఇకపోతే విషయాకొస్తే.. ఈ రైల్వే ఉద్యోగాల కు జూన్ 1 నుంచి దరఖాస్తు చేసుకొవచ్చు.. సదరన్ రైల్వే జోన్ పరిధిలోని పెరంబూర్, పొడనూర్‌ లోని వర్క్‌ షాప్‌లల్లో 3378 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందుకోసం మూడు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదల చేశారు. నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది సదరన్ రైల్వే. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జూన్ 30 సాయంత్రం 5 గంటల్లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొవచ్చు..


కేరళ రాష్ట్రాలు, పుదుచ్చెరీ తో పాటుగా తమిళనాడు, ఏపీ లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, కర్నాటక లోని దక్షిణ కన్నడ జిల్లాల కు చెందినవారు మాత్రమే ఈ పోస్టుల కు దరఖాస్తు చేసుకోవాలి. https://sr.indianrailways.gov.in/ లో మూడు నోటిఫికేషన్లు వేర్వేరు గా ఉన్నాయి. అభ్యర్థులు  ఒకటికి పది సార్లు చదివి అవగాహన చేసుకొని ముందు గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. వయస్సు  15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళల కు ఫీజు లేదు. మొత్తానికి ఇది నిజంగా అప్లై చేసుకొవచ్చు.. ఆసక్తి కలిగిన విద్యార్థులు అప్లై చేసుకొని, మీ కలలను నెరవేర్చుకొండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: