తెలంగాణ రాష్ట్రంలో 2021 సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది ఖరారవ్వడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంకా మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎంసెట్) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలెంగ్ ఇక ఈ నెల 30వ తేదీ నుండి స్టార్ట్ కానుంది. ఇక ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఇంకా ప్రవేశాల కమిటీ సభ్యులు ఏకమయ్యి ఇటీవల షెడ్యూలు ఖరారు చెయ్యడం జరిగింది.ఇక ఈ నెల 30 వ తేదీ నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో ఫీజు చెల్లించి ధ్రువపత్రాల వెరిఫికేషన్ లకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.సెప్టెంబరు 4 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ అనేది జరుగుతుంది.అలాగే సెప్టెంబరు 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించడం జరుగుతుంది.
సెప్టెంబరు 15వ తేదీన ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయించడం జరుగుతుంది.అలాగే సెప్టెంబరు 15 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు కూడా విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది.అలాగే రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ పేర్కొనడం జరిగింది.ఇక తెలంగాణ ఎంసెట్ 2021 'కీ' విడుదలవ్వడం జరిగింది. ఇక ఈ కీ ని తాజాగా అధికారులు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 4 వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా ఆ పరీక్షకు సంబంధించిన కీని విడుదల చేయడం జరిగింది.ఇక ఇదిలా ఉంటే ఎంసెట్ ఫలితాలు అలాగే కౌన్సెలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేయ్యడం జరిగింది. ఈ నెల 25 వ తేదీన అనగా రేపు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేయబోతున్నారు.