చదువు పూర్తి కాకుండానే నెలకు. 20లక్షల జీతం..?
అవును.. అందుకే ఐఐటీలకు అంత గిరాకీ.. ఐఐటీల్లో చదువు పూర్తి చేసుకోబోయే విద్యార్థులను చాలా కంపెనీలు ముందుగానే ఉద్యోగాల ఆఫర్లతో బుక్ చేసుకుంటాయి. ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు సాధారణమే. తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐఐటీ విద్యార్థుల క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జరిగింది. ఇందులో మొదటి రోజే అనేక కంపెనీలు భారీస్థాయి ప్యాకేజీలతో విద్యార్థులను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డాయట.
ఐఐటీ విద్యార్థులను సొంతం చేసుకునేందుకు అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడ్డాయి. గతంలో ఇచ్చిన ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇచ్చాయి. దాదాపు 60 మందికి పైగా విద్యార్థులకు ఏడాదికి కోటి రూపాయల వేతనాలతో ఉద్యోగాలు పొందారు. అంటే మొదటి నెల జీతమే 8 లక్షలకు పైగా ఉంటుందన్నమాట. వీరిలో ఇద్దరికి ఏకంగా రూ. 2 కోట్లకుపైగా వేతనంతో ఉద్యోగాలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 45% ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని సంస్థలు ఆఫర్ చేశాయట.
ఇక అత్యధికంగా ఐఐటీ రవుర్కెలాకు చెందిన ఓ స్టూడెంట్‌కు రూ.2.15 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు ఓ ఇంటర్నేషనల్ టెక్ సంస్థ ముందుకొచ్చిందట. అలాగే ఉబర్ సంస్థ ఓ ఐఐటీ బాంబే స్టూడెంట్‌కు రూ.2.05 కోట్ల జీతం ఇచ్చేందుకు రెడీ అయ్యిందట. మరో ఐఐటీ గువాహటి విద్యార్థికి కూడా రూ.2 కోట్ల ప్యాకేజీ దక్కిందట. మొత్తం దాదాపు 400మంది ఐఐటీయన్లకు తొలిరోజే ఉద్యోగాలు దక్కాయట.