SSC : ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల.. ఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

N ANJANEYULU
స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ టైర్ వ‌న్‌, కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష కోసం 2021-22 ప‌రీక్ష‌ల క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఎస్ఎస్సీ సీజీఎల్‌, సీహెచ్ఎస్ఎల్‌, ఎంటీఎస్ స్టెనోగ్రాఫ‌ర్ సీ అండ్ డీ, జీడీ కానిస్టేబుల్ ఇత‌ర ప‌రీక్ష‌ల కోసం నోటిఫికేష‌న్‌లు, ప‌రీక్ష తేదీలు గ‌తంలోనే విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు అభ్య‌ర్థులు పూర్తి షెడ్యూల్ లేదా తాత్కాలిక ప‌రీక్ష‌ల క్యాలెండ‌ర్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో త‌నిఖీ చేయొచ్చు.
ఎస్ఎస్సీ ప‌రీక్ష‌ల క్యాలెండ‌ర్ 2021-22 కొన్ని ఫెండింగ్‌లో ఉన్న 2021 ప‌రీక్ష‌లు.. రాబోయే 2022 ప‌రీక్ష‌ల తేదీల‌ను వెల్ల‌డించింది. ముఖ్యంగా SSC CGL టైర్ I పరీక్ష న‌మోదు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 23 నుండి ప్రారంభ‌మ‌వుతుంది. సీహెచ్ఎస్ఎల్ టైర్ 1 ప‌రీక్ష కోసం రిజిస్ట్రేష‌న్ ఫిబ్ర‌వ‌రి 01, 2022 నుంచి మొద‌లవుతుంది. అన్నీ ప‌రీక్ష‌ల తేదీలు 2022-23 కు సంబంధించిన ఈ తేదీలు తాత్కాలిక‌మైన‌వ‌ని, ఎప్పుడైనా మారొచ్చ‌ని అభ్య‌ర్థులు గ‌మ‌నించాలి. ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు జ‌రిగితే ఎస్ఎస్సీ అంద‌రికీ తెలియ‌జేస్తూ అధికారిక‌నోటిఫికేష‌న్ జారీ చేస్తుంటుంది.
ఈ ప‌రీక్ష నోటిఫికేష‌న్‌ను డిసెంబ‌ర్ 23,2021న విడుద‌ల చేసి.. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 23 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఆ త‌రువాత ప‌రీక్ష ఏప్రిల్ 2022లో నిర్వ‌హిస్తారు. అదేవిధంగా ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 10+2 ప‌రీక్ష‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ఫిబ్ర‌వ‌రి 01, 2022న విడుద‌ల కానుంది. దానికి  మార్చి 07 2022 నుంచి ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని.. ప‌రీక్ష మే 2022లో నిర్వ‌హించ‌నున్నారు. ఎస్ఎస్సీ ఎంటీఎస్  రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ {{RelevantDataTitle}}