అక్కడ ఫిబ్రవరి 12 వరకు తప్పని ఆన్లైన్ క్లాసులేనట..!
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అండర్ గ్రాడ్యువేట్ కింద మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు.. మరో 13 రోజులలో అనగా ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు ఈరోజు స్పష్టం చేశారు. ఇకపోతే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో యూనివర్సిటీలు విద్యార్థులను నేరుగా పాఠశాలలకు హాజరయ్యేలా చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ని కొవిడ్-19 భద్రత నిబంధనను అనుసరించి విద్యార్థులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇకపోతే విద్యార్థులకు క్యాంపస్ తరగతులు నిర్వహించేటప్పుడు కూడా కొవిడ్-19 భద్రతా నిబంధనలు తప్పకుండా యూనివర్సిటీలో ఫాలో అవుతామని స్పష్టం చేయడం జరిగింది. ఇకపోతే అండర్గ్రాడ్యుయేట్ సంబంధించి మూడు నాలుగు సంవత్సరాల తో పాటు ఫార్మ్-డి తో సహా అన్ని పీజీ కోర్సులకు కూడా పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి క్యాంపస్లోని నిర్వహించబడతాయి అని అధికారులు స్పష్టం చేశారు.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అన్ని విద్యాసంస్థల్లో తిరిగి తిరగడానికి శనివారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ఫిజికల్ కాసుల కోసం కళాశాలలు తిరిగి తెరవడం కి విశ్వవిద్యాలయాలు సైతం సిద్ధం అవుతున్నాయి.