ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..!!
అయితే మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఇంటర్ పరీక్షల పండుగ ప్రారంభమవనుంది.. ఇదిలా ఉండగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయని ఉన్నాయని గత కొన్ని రోజుల క్రితం ఇంటర్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నిర్వహించే పరీక్షలకు మొత్తం 6,48,829 మంది విద్యార్థులు హాజరవుతున్నారు అని ఆయన తెలిపారు. ఇక ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 3,24,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతూ ఉండగా.. ద్వితీయ సంవత్సరం నుంచి 3,24,360 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇక ఇంటర్ విద్యార్థుల సంఖ్యను గ్రూపుల వారిగా విభజిస్తే..అందులో ఎంపీసీ గ్రూప్ లో 3,52,357 మంది, బైపీసీ గ్రూప్ లో 2,06,510 మంది..ఒకేషనల్ గ్రూప్ కోర్సుల్లో 89,962 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామని ఇంటర్ బోర్డు అధికారులు కూడా తెలిపారు.
ఇక ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు 9,65,815 మంది విద్యార్థులు హాజరవుతుండగా థియరీ పరీక్షల నిర్విహించడానికి 1,339 కేంద్రాలు అలాగే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి 1,506 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.