ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ : పూర్తి వివరాలు ?
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: గమనించవలసిన ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 19, 2022
ఆన్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2022
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022:
ఖాళీల వివరాలు
పురుషులు: 06
మహిళలు: 03
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: అర్హత ప్రమాణాలు
అభ్యర్థికి ఎల్‌ఎల్‌బి డిగ్రీలో కనీసం 55% మొత్తం మార్కులు అవసరం (గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్లు లేదా 10+2 పరీక్ష తర్వాత ఐదేళ్లు). అభ్యర్థి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి కూడా అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన కళాశాల/విశ్వవిద్యాలయానికి చెందినవారై ఉండాలి.
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి
జూలై 1, 2022 నాటికి 21 నుండి 27 సంవత్సరాలు (జూలై 2, 1995 కంటే ముందుగా జన్మించకూడదు మరియు జూలై 1, 2001 తర్వాత జన్మించకూడదు; ఈ రెండు తేదీలు బట్టి వయోపరిమితి అనేది ఉంటుంది).
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు చేయడానికి దశలు
అర్హత గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ - joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.కాబట్టి ఆసక్తి ఇంకా అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే వీటికి అప్లై చేసుకోండి.