ఇక తెలంగాణ రాష్ట్రంలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019 అకాడమిక్ ఇయర్‌లో జరిగాయి. ఆ తర్వాత రెండు బ్యాచ్‌ల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేయడం అనేది జరిగింది. పరీక్షలు నిర్వహించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అసలు వర్కవుట్ అనేది కాలేదు.అయితే ఈ సంవత్సరం మే నెలలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గత రెండేళ్లుగా పెద్దగా క్లాస్‌లు జరగలేదు. ఈ సంవత్సరం కూడా అంతంత మాత్రమే జరిగాయి. ఇక షెడ్యూల్ ప్రకారం జనవరి నెల 10 వ తేదీ లోపు సిలబస్ పూర్తి చేయాలి. సంక్రాంతి సెలవులు ఇంకా ఇతర కారణాలతో ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. దాంతో సిలబస్ అనేది ఇంకా చాలా పెండింగ్‌లోనే ఉంది.
ఇక గతంలో కూడా ప్రతి ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ నెల వరకు కూడా జరిగేవి.అలాగే డిసెంబర్ నెల నుంచే ఎడ్యుకేషనల్ డైరెక్టరేట్ నుంచి దానికి తగ్గట్లుగా ప్రణాళికలు అనేవి కూడా సిద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు ఈ పరీక్షల నిర్వహణపై ఎలాంటి ప్రణాళిక అనేది లేదు.దాంతో ఇక ఏం చెయ్యాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. అలాగే పై తరగతులకు టెన్త్ క్లాస్ బేస్‌మెంట్ కాబట్టి మార్కులు తగ్గితే ఎలా అనే గందరగోళంలో కూడా వారు ఉన్నారు. ఇక మార్చి నెలలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. కానీ చాలా చోట్ల మాత్రం ఇంకా అసలు సిలబస్ అనేది కూడా పూర్తి కాలేదు. ఇక ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి.. టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే అభిప్రాయం అనేది వ్యక్తమవుతోంది.