"ఏకకాలంలో రెండు డిగ్రీలు"... ఆనందంలో విద్యార్థులు ?
రెండు డిగ్రీల విధానానికి త్వరలోనే అనుమతి లభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాంతో విద్యార్దులు సంతోషంతో సందడి చేస్తున్నారు. ఎంత చదివినా ఆ విద్య మన భవిష్యత్తును బంగారు బాటగా మలిచేందుకే అని తెలిసిందే. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . విద్యార్థుల భవిష్యత్తు మరియు వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.
రెండు డిగ్రీల విధానానికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు.
ఇక కొత్తగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీలు చేసే అవకాశం దక్కింది. దీని వల్ల విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి, నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థులు ఒకే యూనివర్సిటీ నుండి లేదా వేరు వేరు యునివర్సిటీల నుండి అయినా సరే ఏక కాలంలో రెండు డిగ్రీలు పొందే అవకాశం కల్పించారు . ఫిజికల్ మోడ్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా రెండు డిగ్రీలు చదివే అవకాశం కల్పించినట్లు ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం అని విద్యారంగం మరింత అభివృద్ది చెందేందుకు దోహద పడుతుంది అని యూజీసీ ఛైర్మన్, జగదీష్ కుమార్, చెప్పుకొచ్చారు.