అలెర్ట్: "టెట్" కు శిక్షణ తీసుకుంటున్నారా ?

VAMSI
టెట్ పరీక్షకు సిద్దం అవుతున్నారా ? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. టిఎస్ టెట్ కోసం పోటీ పడే అభ్యర్ధులకు ఈ వార్త చాలా ముఖ్యమైనది. టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు మరింత ట్రై చేసేందుకు వారిలో నైపుణ్యం పెంచేందుకు గాను శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 15 నుండి నిర్వహించ బోయే పరీక్షలకు తరగతుల షెడ్యుల్ ను విడుదల చేసింది టీ - శాట్. ఈ పరీక్ష వివరాలకు వస్తే.. ఉదయం 8 గంటల 8.30 గంటల వరకు తెలుగు పేపర్ -1 (సందులు పార్ట్ 1), ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు తెలుగు పేపర్ -2 (అక్షర భాగం). ఆ తరవాత ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈవీఎస్ ఉర్డు మీడియం పేపర్ (1&2) ప్రసారం అయిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ ల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలను కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్దులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే చాలా మంది వరకు సరైన గైడ్ లైన్స్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ శిక్షణ తరగతులు అనేవి బాగా ఉపయోగపడనున్నాయి. కావున అభ్యర్దులు ఇది గమనించి సద్వినియోగ పరుచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.
ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఈ సారి ఫీజులను బాగా పెంచేశాయి ..ఈ సారి కోచింగ్‌ కేంద్రాలు కూడా ఫీజులు భారీగా పెంచేశాయి. సాధారణంగా షార్ట్‌ టర్మ్‌ కోచింగ్‌ కింద వంద రోజుల ప్రణాళిక ఉండగా... అది కాస్తా ఇప్పుడు రెండున్నర నెలల తక్కువ సమయమే ఉండటం తో అందుకు తగ్గట్టుగా కోచింగ్‌ సెంటర్‌లు ప్రణాళికలను శర వేగంగా సిద్ధం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: