ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరపడండి!
మొత్తం ఖాళీలు :
1.హెడ్ కానిస్టేబుల్ (పురుషులు)-135
2.హెడ్ కానిస్టేబుల్ (స్త్రీలు)-158
3.హెడ్ కానిస్టేబుల్ (ఎల్డీసీఈ) - 90
వేతనం విషయానికి వస్తే:
రూ.25,500-రూ.81,100 ఉంటుంది.(7వ వేతన కమిషన్ ప్రకారం)
విద్యార్హతలు విషయానికి వస్తే:
ఇక అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 సర్టిఫికెట్ ని కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేసే స్కిల్ కూడా ఉండాలి.
వయో పరిమితి :
హెడ్ కానిస్టేబుల్ (డైరెక్ట్ ఎంట్రీ) పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 25 ఏళ్ల లోపువారై ఉండాలి. ఇక అభ్యర్థులు 2/01/0/1997 కన్నా ముందు జన్మించి ఉండరాదు. హెడ్ కానిస్టేబుల్ (ఎల్డీసీఈ) పోస్టులకు 35 ఏళ్లు లోపు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఇంకా అలాగే ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ముఖ్య తేదీలు :
జూన్ 8, 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతంది. చివరి గడువు వచ్చేసి జూలై 7, 2022.
ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే :
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే వీటికి అప్లై చేసుకోవాలి.ఇక ఆఫ్‌లైన్‌లో పంపించే దరఖాస్తులు స్వీకరించరు. www.recruitment.itbpolice.nic.in ద్వారా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అనేది అధికారిక వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది.