టెన్త్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు.. త్వరపడండి!

Purushottham Vinay
ఇక ఇండియన్ ఆర్మీ కి చెందిన సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా వాషర్‌మెన్ ఇంకా ట్రేడ్స్‌మెన్‌మేట్‌ల పోస్టులకు సంబంధించి మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన 45 రోజులలోపు ఆఫ్‌లైన్‌లో వారు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. అలాగే అభ్యర్థులు దరఖాస్తును ఇంగ్లీష్/హిందీలో సబ్‌మిట్ చేయవచ్చు. వీటికి ఎంపికైన అభ్యర్థులకు హెడ్ క్వార్టర్స్ సదరన్ కమాండ్‌లోని ఏదైనా AMC యూనిట్‌లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు.

అర్హత ప్రమాణాల విషయానికి వస్తే..

వాషర్‌మెన్ పోస్ట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మిలిటరీ/సివిలియన్ దుస్తులను వారు బాగా ఉతకగలగాలి.

ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్ట్ : వీరు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో ఖచ్చితంగా పాసై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లలో ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి.

ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు వచ్చేసి ఖచ్చితంగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం విషయానికి వస్తే:

స్టెప్-1: ప్రతి దరఖాస్తుదారుడు కూడా ఒక్కో పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
స్టెప్-2: ఇక రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
స్టెప్-3: కమాండెంట్, మిలిటరీ హాస్పిటల్, డిఫెన్స్ కాలనీ రోడ్, చెన్నై, తమిళనాడు, పిన్: 600032 అనే ఈ చిరునామాకు పోస్ట్ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
స్టెప్-4: ఇక అభ్యర్థులు ఎన్వలప్ పైన, క్యాపిటల్ లెటర్స్‌లో కేటగిరీ విభాగంలతో ఏ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారో  వారు చాలా స్పష్టంగా తెలియజేయాలి.
స్టెప్-5: అలాగే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు కూడా ఎన్వలప్ ఎడమ వైపు మూలలో వారి కేటగిరీని కూడా పేర్కొనాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు విషయానికి వస్తే..
ఇక అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రశ్నాపత్రం హిందీ ఇంకా ఇంగ్లీష్ రెండు భాషల్లో ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలు మాత్రం ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయి. ఈ పరీక్షలో 10వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి.అలాగే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: