నీట్ లాగే మరో ఘటన.. స్త్రీలకు మళ్ళీ అవమానం!

Purushottham Vinay
రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ (REET) పరీక్షకు హాజరైన విద్యార్థుల విషయంలో అనుచితంగా ప్రవర్తించారు. ఇక ఎలాంటి చీటింగ్‌ జరగకుండా ఉండేందుకు.. తనిఖీ చేస్తున్న సిబ్బంది మహిళా అభ్యర్థులను డ్రస్ పై వేసుకున్న దుపట్టాలను తొలగించడం వంటి చర్యలకు వారు పాల్పడ్డారు. సల్వార్ బటన్లు కూడా కత్తిరించారు. ఇంకా అంతే కాకుండా.. చీర పిన్ లను తొలగించమని హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇక ఈ సంవత్సరం రీట్ కోసం.. రాష్ట్రంలోని దుంగార్‌పూర్ జిల్లాలో మొత్తం 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 6 గంటల నుంచే విద్యార్థులు ఈ కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రం వెలుపల ఉంచిన జాబితాలోని వారి రోల్ నంబర్‌తో పాటు ఇంకా గది నంబర్‌ను సరి చూసుకున్నారు. ఉదయం పూట నుంచి అన్ని కేంద్రాల వద్ద పోలీసు బృందాలను మోహరించారు. 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి విద్యార్థుల ప్రవేశం అనేది ప్రారంభం కాగా.. ఇక అంతకు ముందు విద్యార్థులు చెకింగ్ పరీక్షకు వెళ్లాల్సి వచ్చింది.ఇక వారు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు.. విద్యార్థులను వ్యక్తిగతంగా {{RelevantDataTitle}}