మన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశావ్యాప్తంగా టాప్ యూనివర్సిటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ కూడా మంచి గుర్తింపు పొందింది. ఇందులో చదివితే విద్యార్థికి మంచి భవిష్యత్తుతో పాటు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి.ఇక ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(ఎస్‌డీఈ)-డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో బీఏ, బీకాం, బీఎస్సీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. బీఏ, బీకాం ప్రోగ్రామ్‌లను తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదువుకోవచ్చు. బీఎస్సీ ప్రోగ్రామ్ ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంది.బీఎస్సీ సబ్జెక్ట్‌లలో మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, జియాలజీ, బోటనీ, జువాలజీ ఉంటాయి.అర్హత విషయానికి వస్తే..సంబంధిత సబ్జెక్ట్‌లతో ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు.పీజీ ప్రోగ్రామ్‌లు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి.ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు ఉంటుంది.
ఎంఏ స్పెషలైజేషన్‌ల విషయానికి వస్తే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఫిలాసఫీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మేథమెటిక్స్ ఉంటాయి.ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లలో సైకాలజీ, మేథమెటిక్స్, బోటనీ, ఫిజిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జువాలజీ ఉంటాయి.ఎంబీఏ స్పెషలైజేషన్‌లలో హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్స్, మార్కెటింగ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి.అర్హత విషయానికి వస్తే అభ్యర్థులు ఎంచుకొన్న ప్రోగ్రామ్‌ను అనుసరించి ద్వితీయ శ్రేణి మార్కులతో సంబంధిత డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తిచేసి ఉండాలి.పీజీ డిప్లొమా విషయానికి వస్తే ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది.స్పెషలైజేషన్‌లు వచ్చేసి కో-ఆపరేషన్ అండ్ రూరల్ స్టడీస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్స్, మేనేజ్‌మెంట్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్, ఫంక్షనల్ ఇంగ్లీష్, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, మేనేజ్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఉంటాయి.అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు.ఇంకా పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ www.andhrauniversity.edu.in ని విజిట్ చెయ్యండి.