తెలంగాణ: ఇంజనీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్?

Purushottham Vinay
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను సర్కార్ కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు కాలేజీలకు సంబంధించి కొత్త ఫీజులపై జీవో జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలోని 159 కళాశాలల్లో ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో ఆయా కాలేజీలకు సంబంధించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల మినిమమ్ ఫీజుగా రూ.45 వేలుగా ఖరారు చేసింది. వార్షిక ఫీజును రూ.57 వేలుగా ఖరారు చేసింది. తాజా ఫీజుల వివరాల ప్రకారం 40 కాలేజీల్లో ఫీజులు రూ.లక్ష దాటాయి. ఎంజిఐటిలో (MGIT) అత్యధికంగా రూ.1.60 లక్షలుగా ఉండనుంది. సివిఆర్ (CVR) కాలేజీలో రూ.1.50 లక్షలు, సీబీఐటీ (CBIT), వర్ధమాన్, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా ఫీజులు ఖరారు అయ్యాయి. అయితే ఈ ఫీజులు 3 ఏళ్లు అమలులో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంకా అలాగే మరోవైపు ఎంసెట్ చివరి విడత కౌన్సిలింగ్ ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఫీజులు ఖరారు చేయగా..ఫీజు రీఎంబర్స్ మెంట్ పై మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీనితో ఆయా కేటగిరీల్లో పెరిగిన ఫీజుల భారం విద్యార్ధులపై పడనుంది.



అయితే ఫీజులపై స్పష్టత ఇచ్చి ఫీజు రీఎంబర్స్ మెంట్ పై మాత్రం ఎందుకు క్లారిటీ ఇవ్వలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ఫీజులను కూడా ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనీస వార్షిక రుసుమును రూ.27 వేలుగా ఖరారు చేసింది. పెరిగిన ఈ ఫీజులు 2022-23, 2023-24,2024-25 అకాడమిక్ ఇయర్స్ లో అమలులో ఉంటాయి.ఇక రెండో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు అలాట్మెంట్ ఆర్డర్ ను ఈ కింది స్టెప్స్ తో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తొలుత ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://tseamcet.nic.in/default.aspx ఓపెన్ చేయాలి. ఆ తరువాత Candidates Login ఆప్షన్ పై క్లిక్ చేయాలి.  Login ID No, TS EAMCET Hall Ticket No, Password, Date of Birth వివరాలను నమోదు చేసి, Sign-in ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Allotment Order ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక దీంతో స్క్రీన్ పై అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది. ఆ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: