వర్షా కాలం వచ్చింది కానీ వర్షాలు మాత్రం రాలేదు. ఎక్కడో కొన్ని చోట్ల చేదురు మోదురు వర్షాలను మినహాయిస్తే వర్షాలు పూర్తి స్థాయిలో ఇంకా మొదలు కాలేదు. దానితో రైతులు విత్తనాలు పెట్టే సమయం వచ్చింది. కానీ వర్షం మాత్రం రావట్లేదు. విత్తనాలు పెట్టాలా ..? వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇకపోతే ఇలాంటి సమయంలో తెలంగాణ రైతాంగానికి ఒక శుభవార్త వచ్చింది. అదేంటంటే తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో ఈ రోజు నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరి ఆ జిల్లాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ వెల్లడించింది. ఈ జిల్లాతో పాటు మంచిర్యాల్ , జగిత్యాల్ , సిద్దిపేట్ , సంగారెడ్డి , గజ్వేల్ , వర్ధన్న పేట , నారాయణ పేట , పెద్దపల్లి , కరీంనగర్ , బెల్లంపల్లి , సిరిసిల్ల , మెదక్ , మహబూబ్ నగర్ , హనుమకొండ , నాగర్ కర్నూల్ , వరంగల్ జిల్లాలలో ఈ రోజు నుండి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.
ఇక వాతావరణ శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం దాదాపు తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో ఈ రోజు నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దానితో తెలంగాణ రైతాంగం చాలా సంతోషపడుతుంది. మరి ఈ మూడు రోజులు నిజం గానే భారీ వర్షాలు కనుక పడినట్లు అయితే రైతులకు ఇది నిజంగానే శుభవార్త అవుతుంది. మరి ఏ స్థాయిలో ఈ మూడు రోజులు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయో చూడాలి.