జూలైలో నిర్వహించబోయే గ్రూప్- 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు .ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఏప్రిల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా.. మెయిన్స్కు 92 వేల మందికి పైగా క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.
మరోవైపు, గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సిలబస్లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల అభ్యర్థనల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న వేళ ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయించాలని కోరుతూ పలు జిల్లాల్లోని అభ్యర్థులు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలిస్తున్నారు. కొత్త సిలబస్ దృష్ట్యా గ్రూప్-2 మెయిన్స్ రెండు నెలలు వాయిదా వేయాలని MLCలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు ఫిబ్రవరి 7న లేఖ రాయగా సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు మరోసారి లేఖ రాశారు. గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలన్న విజ్ఞప్తులను ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది.
గ్రూప్ 2 మెయిన్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 28న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది APPSC. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రెస్ నోట్ ద్వారా తెలిపింది.గత ప్రభుత్వ హయాంలో 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ నోటిఫికేషన్ ద్వారా 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 556నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అప్పటి ప్రభుత్వం.ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెబ్ నోట్లో పేర్కొంది. ఏపీలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, మరో 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఫలితాలను ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసింది ఏపీపీఎస్సీ. జులై 28న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తాజాగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు వెబ్ నోట్ విడుదల చేసింది.